ఇష్టారాజ్యంగా కొందరు ఐఏఎస్‌ల తీరు..

ABN, Publish Date - Jun 16 , 2025 | 09:34 AM

IAS officers: మరికొందరు ఐఏఎస్‌లు పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలు కూడా పట్టించుకోవడంలేదని సచివాలయంలో చెప్పుకుంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోస్టుల్లోకి వచ్చిన పలువురు అధికారుల తీరు మరింత ఇబ్బందికరంగా ఉంటోదని ఆయా శాఖల్లో పని చేసే ఉద్యోగులు చెబుతున్నారు.

Hyderabad: ‘మా శాఖలో మేమే సర్వం.. మేము చెప్పినట్లే జరగాలి’ అన్నట్లుగా రాష్ట్రంలో పని చేస్తున్న కొందరు ఐఏఎస్‌ల తీరు ఉంటోంది. వారు తీసుకున్న నిర్ణయాలతోపాటు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారుతోంది (IAS officers controversy). కొంతమేర ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెడుతోంది. కొందరు సీనియర్ ఐఏఎస్‌ (Senior IAS)లు తమ సహచార అధికారుల పట్ల ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. కొందరైతే ఏకంగా నోటికి పని చెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారని సచివాలయంలో చెప్పుకుంటున్నారు (Secretariat discussions).


మరికొందరు ఐఏఎస్‌లు పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలు కూడా పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోస్టుల్లోకి వచ్చిన పలువురు అధికారుల తీరు మరింత ఇబ్బందికరంగా ఉంటోదని ఆయా శాఖల్లో పని చేసే ఉద్యోగులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 16 , 2025 | 09:34 AM