భారీ వర్షాలు.. బస్తీల్లోకి సీఎం రేవంత్..

ABN, Publish Date - Aug 10 , 2025 | 09:47 PM

హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆ క్రమంలో బల్కంపేట, అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని గంగూబాయి బస్తీ, బుద్ధ నగర్‌ను సందర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని సైతం వర్షాలు ముంచెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆ క్రమంలో బల్కంపేట, అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని గంగూబాయి బస్తీ, బుద్ధ నగర్‌ను సందర్శించారు. ఈ మేరకు బస్తీ వాసులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి నీరు ఎలా వస్తోంది, అందులో మురుగు నీరు ఏమైనా కలుస్తోందా? అంటూ అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి చెప్పిన సమాధాలను సావధానంగా విన్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులను ఆదేశించారు.

Updated at - Aug 10 , 2025 | 09:47 PM