47 ఏళ్ల క్రితం.. ఇదే రోజున: సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Mar 15 , 2025 | 06:41 PM
47 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా అడుగుపెట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 41 సంవత్సరాలుగా తాను అసెంబ్లీలో కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు.
పశ్చిమ గోదావరి: 47 సంవత్సరాల క్రితం ఇదే రోజు(15 మార్చి 1978)న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా అడుగుపెట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 41 సంవత్సరాలుగా తాను అసెంబ్లీలో కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన "స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా "ఇదే రోజున మీరు మెుదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారని, 47 ఏళ్ల తర్వాత మీ అనుభవం ఎలా అనిపిస్తోందంటూ" భాస్కర్ రావు అనే టీడీపీ అభిమాని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దక్కని గౌవరం తనకు దక్కిందని, ఇది అసాధారణమైన గౌరవమంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Sunita Reddy: గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన సునీతా రెడ్డి.. తండ్రి హత్యపై ఫిర్యాదు..
CM Chandrababu Naidu: రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..
Updated at - Mar 15 , 2025 | 09:59 PM