టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే..
ABN, Publish Date - Mar 09 , 2025 | 08:36 PM
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై టీడీపీ క్లారిటీ ఇచ్చింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ప్రకటించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై టీడీపీ క్లారిటీ ఇచ్చింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ప్రకటించింది. బీటీ నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ కాగా ఆయనకు సీఎం చంద్రబాబు మరో అవకాశం ఇచ్చారు. బీసీ కోటాలో యాదవ సామాజికవర్గానికి చెందిన బీద రవిచంద్రకు అవకాశం కల్పించారు. అలాగే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కావలి గ్రీష్మకూ సీటు ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లో స్పీకర్‍గా పని చేసిన ప్రతిభా భారతి కుమార్తే కావలి గ్రీష్మ. మరో రెండు స్థానాలను కూటమిలో భాగంగా బీజేపీకి ఒకటి, జనసేనకు మరొకటి కేటాయించారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సోదరుడు నాగబాబు పేరును ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కసరత్తు చేస్తున్నారు. సోము వీర్రాజు, మాధవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర పెద్దలతో ఆమె మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
SSMB 29 Video Leak: రాజమౌళి, మహేశ్ బాబుకు షాక్.. ఎస్ఎస్ఎంబీ-29 వీడియో లీక్..
Updated at - Mar 09 , 2025 | 08:38 PM