కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యాచరణ

ABN, Publish Date - Jun 10 , 2025 | 08:39 AM

Kaleshwaram commission: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది.

Hyderabad: బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) బుధవారం కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram commission) విచారణకు (Inquiry) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని అక్కడి నుంచి బీఆర్కే భవన్‌కు రావడం.. అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


భారీగా పార్టీ శ్రేణులు తరలి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ పిలుపు ఇచ్చినట్లు తెలియవచ్చింది. తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతోపాటు మాజీ ప్రజా ప్రతినిధులకు కూడా తెలంగాణ భవన్ నుంచి సందేశం పంపినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 10 , 2025 | 08:39 AM