కులగణన సర్వేపై కేటీఆర్ ఆగ్రహం..

ABN, Publish Date - Feb 04 , 2025 | 08:38 PM

హైదరాబాద్: విద్య, ఉపాధిలో మాత్రమే కాకుండా ఆర్థికంగా ఎస్సీలు ముందుకెళ్లేందుకు అవకాశం కల్పించినప్పుడే వారికి సరైన న్యాయం జరుగుతుందని బీర్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణనపై మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు.

హైదరాబాద్: విద్య, ఉపాధిలో మాత్రమే కాకుండా ఆర్థికంగా ఎస్సీలు ముందుకెళ్లేందుకు అవకాశం కల్పించినప్పుడే వారికి సరైన న్యాయం జరుగుతుందని బీర్ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణనపై మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై సభలో చర్చిస్తున్నప్పుడు మందకృష్ణ మాదిగ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. వర్గీకరణ కోసం ఆయన చేసిన పోరాటం, అలాగే అమరులైన వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కాగా, కులగణన సర్వే మెుత్తం తప్పులతడకగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు.

Updated at - Feb 04 , 2025 | 08:38 PM