ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్..

ABN, Publish Date - Jul 19 , 2025 | 09:00 PM

హిమాచల్ ప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అన్నాతముళ్లు ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సిర్మౌర్ జిల్లా షిల్లాయికి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి సమీప గ్రామానికి చెందిన సునీత చౌహాన్ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అన్నాతముళ్లు ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సిర్మౌర్ జిల్లా షిల్లాయికి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి సమీప గ్రామానికి చెందిన సునీత చౌహాన్ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. బహుభర్తత్వానికి సంబంధించిన వేడుకను వైభవంగా నిర్వహించారు. జలశక్తి శాఖలో ప్రదీప్ నేగి పని చేస్తుండగా.. సోదరుడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ దూరంగా పని చేస్తున్నా సునీతను పెళ్లి చేసుకునే విషయంలో శాస్త్రాలను పాటించారు. పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నట్లు వారంతా అంగీకరించారు. కాగా.. ఈ వార్త ఇప్పుడు నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

Updated at - Jul 19 , 2025 | 09:01 PM