ABN Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ABN, Publish Date - Mar 18 , 2025 | 10:43 AM
ఏపీ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలలోనూ ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సభలో ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లు, ప్రయివేట్ విశ్వ విద్యాలయాల సవరణ బిల్లులను ప్రవేశ పెట్టనుంది.
అమరావతి: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు (AP Legislative Assembly Budget Sessions) 13వ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అలాగే 10 గంటలకు శాసన మండలి (12వ రోజు) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో కాలువల ఆక్రమణలు... ప్రయివేటు పాఠ శాలలో భద్రత చర్యలు... బుడమేరు ఆక్రమణ... సూపర్ సిక్స్ పథకాలు.. తదితర అంశాలపై శాసన సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
Also Read..:
యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న మహిళ అరెస్టు..
అలాగే ఆంధ్ర ప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల సవరణ బిల్లు, ప్రయివేట్ విశ్వ విద్యాలయాల సవరణ బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. వాట్సాప్ పాలనపై శాసన సభలో లఘు చర్చ జరగనుంది. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక పర్యాటకం... రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలు.... 50 సంవత్సరాలకు పింఛన్ పథకం... రైతులు ఆత్మహత్యలు తదితర అంశాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. శాసనమండలి ముందుకు 2025 ఏపీ ఆయుర్వేద హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీ కరణ సవరణ బిల్లు రానుంది. మరోవైపు పదవి కాలం ముగిసిన 7 గురు ఎమ్మెల్సీలకు శాసనమండలి ఘనంగా వీడ్కోలు పలకనుంది. ఏపీ ఉభయ సభల సమావేశాలు ఏబీఎన్ లైవ్ ద్వారా చూడండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పెనుగంచిప్రోలు తిరుణాలలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..
Chiranjeevi: లండన్‌లో మెగాస్టార్ చిరంజీవి..
విజయనగరంలో ‘కోర్ట్’ సినీ బృందం సందడి
For More AP News and Telugu News
Updated at - Mar 18 , 2025 | 10:43 AM