చంద్రబాబు ఆదేశాలతో అధికారులపై క్రిమినల్ కేసులు..
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:35 PM
తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టీటీడీ ఈవో ప్లానింగ్ ఏమిటని అడిగారు. భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా ఎందుకు ప్లానింగ్ చేయలేక పోయారంటూ ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇక పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని సీఎంవో అధికారులు నివేదిక ఇచ్చారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టీటీడీ ఈవో ప్లానింగ్ ఏమిటని అడిగారు. భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా ఎందుకు ప్లానింగ్ చేయలేక పోయారంటూ ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నించారు. ఇక పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని సీఎంవో అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ ఘటనలో ఉన్నతాధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు. దీంతో బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ మొత్తం వ్యవహారంలో పలువురిపై వేటు పడే అవకాశముందని సమాచారం. మరోవైపు తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి. ఆ రోజు.. దేవ దేవుడు శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకొనేందుకు.. తిరుపతిలో ముందుగా టోకెన్లు జారీ చేయనున్నారు. అందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యలో టీటీడీ ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 09 , 2025 | 02:44 PM