డాక్టర్ ఫ్యామిలీ చివరి సెల్ఫీ వీడియో వైరల్
ABN, Publish Date - Jun 13 , 2025 | 01:46 PM
Ahmedabad: ఎయిర్ ఇండియా ప్రమాదం డాక్టర్ కుటుంబాన్ని చిదిమేసింది. లండన్‌లో స్థిరపడాలనుకుంటున్న డాక్టర్ ప్యామిలీలోని భార్య, భర్త, ముగ్గురు పిల్లలు విమాన ప్రమాదంలో చనిపోయారు. అయితే వారి చివరిసారిగా తీసుకున్న సెల్ఫీ వీడియో...
Ahmedabad: ఎయిర్ ఇండియా ప్రమాదం (Air India Crash) డాక్టర్ కుటుంబాన్ని చిదిమేసింది (Doctor Family Tragedy). లండన్ (London)లో స్థిరపడాలనుకుంటున్న డాక్టర్ ప్యామిలీలోని భార్య, భర్త, ముగ్గురు పిల్లలు విమాన ప్రమాదంలో చనిపోయారు. అయితే వారి చివరిసారిగా తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Selfie Video Goes Viral).
రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు కుమార్తె నిర్యా, ప్రద్యుత్, నకుల్ (కవల పిల్లలు) ఉన్నారు. భార్యా భర్తలు ఉదయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవలే లండన్‌కు వెళ్లారు. కుటుంబాన్ని కూడా లండన్‌కు తీసుకువెళ్లేందుకు రెండు రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
మరిన్ని.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 13 , 2025 | 01:46 PM