అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ
ABN, Publish Date - Aug 05 , 2025 | 04:55 PM
జూబ్లీహిల్స్‌లోని కడారి ఆర్ట్ గ్యాలరీలో చిన్నారి అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.
జూబ్లీహిల్స్‌లోని కడారి ఆర్ట్ గ్యాలరీలో చిన్నారి అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో పాటు ప్రముఖ నటుడు మాగంటి మురళీ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై జ్వోతి ప్రజల్వన చేసి.. ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ప్రముఖ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. మనస్సు ఉంటే మార్గం ఉంటుందన్నారు.
అలాగే ఆలోచన ఉంటే ఆచరణ ఉంటుందనేలా అతి చిన్న వయసులోనే అనన్య నాదెళ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందించ దగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనన్య నాదెళ్లను ఆయన అభినందించారు. గత రెండేళ్లుగా తాను ఈ చిత్రాలను గీస్తున్నానని చిన్నారి అనన్య ఈ సందర్భంగా తెలిపారు.
ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌కు అనన్య నాదెళ్లకు శిక్షణ ఇచ్చిన ఉదయ్ భాస్కర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు అనూష, శ్రుతి విచ్చేశారు. అలాగే అనన్య నాదెళ్య తల్లిదండ్రులు నందీప్, కావ్య, తాత, అమ్మమ్మ సుబ్బారావు, మాధవితోపాటు బొల్లినేని కృష్ణయ్య, చుక్కపల్లి సురేష్ తదితరులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు.
ఈ వీడియోలను వీక్షించండి..
మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది నేనే..జగన్ కీలక వ్యాఖ్యలు
క్లౌడ్ బరస్ట్..కొట్టుకుపోయిన గ్రామం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 05 , 2025 | 05:00 PM