తిరుమలకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Dec 30 , 2025 | 10:08 AM
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు.
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహా ఇంకా పలువురు ప్రముఖులు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
Updated at - Dec 30 , 2025 | 10:08 AM