Share News

Chinese manja death: మరో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా.. ఏమైందంటే..

ABN , Publish Date - Dec 29 , 2025 | 06:19 PM

చైనా మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయనే కారణంతో దాని వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, నిఘా లేకపోవడం వల్ల దానిని అందరూ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. చాలా తక్కువ ధరకే దొరుకుతుండడంతో అందరూ పతంగులు ఎగరేయడానికి చైనా మాంజానే వినియోగిస్తున్నారు.

Chinese manja death: మరో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా.. ఏమైందంటే..
Chinese manja

హైదరాబాద్ నగరంలో చైనా మాంజా ఆందోళన కలిగిస్తోంది. చైనా మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయనే కారణంతో దాని వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, నిఘా లేకపోవడం వల్ల దానిని అందరూ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. చాలా తక్కువ ధరకే దొరుకుతుండడంతో అందరూ పతంగులు ఎగరేయడానికి చైనా మాంజానే వినియోగిస్తున్నారు. అయితే ఇది చాలా మంది ప్రాణాలు తీస్తోంది (manja kite string accident).


ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక వ్యక్తి చైనా మాంజా వల్ల గొంతు కోసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు (dangerous Chinese manja). తాజాగా మరో వ్యక్తి చైనా మాంజా వల్ల తీవ్ర గాయాలపాలయ్యాడు. హైదరాబాద్ పాతబస్తీ నవాబ్ సాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు చార్మినార్ వైపు బైక్ వెళుతున్నాడు. శంషీర్ గంజ్ ప్రాంతంలో చైనా మాంజా అతడి గొంతుకు తగిలి కోసుకు పోయింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..


మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 29 , 2025 | 06:40 PM