Yadagirigutta: యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:52 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కొండపై రద్దీ నెలకొంది.
యాదగిరిగుట్ట, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కొండపై రద్దీ నెలకొంది. మూడు రోజుల పాటు (శుక్ర, శని, ఆదివారం) వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉభయ క్యూలైన్లలో రద్దీ కనిపించింది. సుమారు 55వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం రాజభోగం(ఆరగింపు) సమయాల్లో ఉభయ క్యూలైన్లలో భక్తులు సుమారు 3గంటలు వేచి ఉన్నారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.55,05,696 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్.వెంకట్రావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ