Share News

KCR Grandson Himanshu: యాదగిరిగుట్ట క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి నాగవల్లీ దళార్చన

ABN , Publish Date - May 21 , 2025 | 04:56 AM

యాదగిరిగుట్ట అంజనేయస్వామికి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నాగవల్లీ దళార్చన నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.

KCR Grandson Himanshu: యాదగిరిగుట్ట క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి నాగవల్లీ దళార్చన

  • యాదగిరీశుడిని దర్శించుకున్న కేసీఆర్‌ మనుమడు

యాదగిరిగుట్ట, మే 20 (ఆంధ్రజ్యోతి): హనుమాన్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ క్షేత్రపాలకుడు అంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చన నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద అంజనేయస్వామికి వేదమంత్రాలతో పంచామృతాభిషేకం చేసిన అర్చకులు తమలపాకులు, సింధూరం, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. 22న(గురువారం) హనుమాన్‌ జయంతి సందర్భంగా విష్ణుపుష్కరిణి చెంత ఉన్న అంజనేయ స్వామి ఆలయం, పాతగుట్ట అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 04:57 AM