Share News

Women Commandos Patrol: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మహిళా కమాండోల గస్తీ

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:35 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇకనుంచి మహిళా కమాండోలు గన్స్‌తో గస్తీ చేస్తారని జీఎంఆర్ అధికారులు తెలిపారు. 15 మంది సీఐఎ్‌సఎఫ్‌ మహిళా కమాండోలు శనివారం నుండి విధుల్లో చేరారు

Women Commandos Patrol: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మహిళా కమాండోల గస్తీ

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇకనుంచి భద్రత విధుల్లో మహిళా కమాండోల సేవలను ఉపయోగించుకోనున్నట్లు జీఎంఆర్‌ అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టులో ఇప్పటివరకు సీఐఎ్‌సఎఫ్‌ మహిళా కమాండోలు పాస్‌పోర్టు, లగేజీ తనిఖీలు వంటి విధులు నిర్వహించేవారు. ఇప్పుడు గన్స్‌ పట్టుకుని గస్తీ కాయనున్నారు. శనివారం 15 మంది సీఐఎ్‌సఎఫ్‌ మహిళా కమాండోలు విధుల్లో చేరారు. ఎయిర్‌పోర్టులో మొదటిసారిగా మహిళా కమాండోలు వెపన్స్‌ పట్టుకుంటున్నారని జీఎంఆర్‌ పేర్కొంది.

Updated Date - Apr 20 , 2025 | 04:35 AM