Wine Dealers: బార్ అండ్ రెస్టారెంట్లకూ రెండేళ్లకోసారి టెండర్లు పిలవాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్‌లకూ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా ప్రతీ రెండేళ్లకు ఒకసారి టెండర్లు పిలిచి ఎక్కువ పాడిన వారికి కేటాయించాలని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మ

తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్
పంజాగుట్ట, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్‌లకూ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా ప్రతీ రెండేళ్లకు ఒకసారి టెండర్లు పిలిచి ఎక్కువ పాడిన వారికి కేటాయించాలని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలకు ప్రతీ రెండేళ్లసారి టెండర్లు పిలిచి అనుమతి ఇస్తున్నారని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు.
మద్యం దుకాణాల వలన తాము నష్టపోతున్నామని బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లలో మద్యం సీసా నుంచే మద్యం విక్రయాలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో నిబ్, క్వార్టర్, హాఫ్ బాటిళ్లలో విక్రయాలు చేస్తుండడంతో మద్యం దుకాణాలలో సేల్స్ 20శాతం పడిపోయాయని పేర్కొన్నారు.