Damodar Raja Narasimha: వైద్య అనుబంధ వృత్తుల కౌన్సిల్ చైర్మన్ నియామకమెప్పుడో
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:57 AM
కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. వైద్య రంగంలో పని...
ఏడాదిగా చైర్మన్ పోస్టు ఖాళీ
భర్తీ చేయాలని ‘ఫోరం’ డిమాండ్
కేంద్ర ప్రభుత్వం 2021 మార్చిలో వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. వైద్య రంగంలో పని చేసే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తప్ప మిగతా 57 రకాల వైద్య అనుబంధ వృత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. కానీ, దేశంలో 11 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ర్టాలు ఏర్పాటు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం 2022లో చైర్మన్, ముగ్గురు కో-ఆప్షన్ నెంబర్లతో రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. కానీ ఇతర సభ్యులను నియమించలేదు. చైర్మన్‌గా నిమ్స్‌కు చెందిన డా.విజయ్ కుమార్‌ను నియమించగా, ఆయన కాల పరిమితి గతేడాది ముగిసింది. అప్పటి నుంచి చైర్మన్‌ను, ఎక్స్-అఫిషియో సభ్యులను నియమించలేదు. ఈ తరణంలో చైర్మన్‌తో పాటు ఇతర సభ్యులను నియమించాలని వైద్య అనుబంధ వృత్తుల జాయింట్ ఫోరం, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ సంయుక్తంగా సర్కారును కోరాయి. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనాను కలసి వినతిపత్రం ఇచ్చాయి.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News