Share News

ఉపాధి కరువై.. అప్పులు బరువై!

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:57 AM

ఉపాధి కరువై.. అప్పులు తీర్చే మార్గంలేక చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో జరిగింది.

ఉపాధి కరువై.. అప్పులు బరువై!

  • సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల క్రైం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కరువై.. అప్పులు తీర్చే మార్గంలేక చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో జరిగింది. వలస రమేశ్‌ (48) కొన్ని నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. దీనికి తోడు కొంతకాలంగా సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాడు.


పైగా రూ.5లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ తరుణంలో రమేశ్‌ మద్యానికి బానిసై అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, కుమారులు సాయిచరణ్‌, సచిన్‌లు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ కృష్ణ తెలిపారు.

Updated Date - Jun 22 , 2025 | 04:57 AM