Water Supply Disruption: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నిలిచిపోనున్న వాటర్ సప్లై..
ABN , Publish Date - Oct 12 , 2025 | 02:35 PM
అక్టోబర్ 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిచిపోనుంది. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సరిపడా నీళ్లు నిల్వ చేసుకోవాలని అధికారులు కోరారు.
హైదరాబాద్: మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రేపు (సోమవారం), ఎల్లుండి(మంగళవారం) వాటర్ సప్లై నిలిచిపోనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-3 రింగ్ మెయిన్-1లో రిపేర్ పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిపివేయనున్నారు. అక్టోబర్ 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దాదాపు 36 గంటలపాటు ఆ ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిచిపోనుంది.
వాటర్ సప్లై ఆగిపోయే ప్రాంతాలు..
గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరీ హిల్స్, ప్రశాసన్ నగర్, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, తట్టిఖానా, భోజగుట్ట, షేక్‌పేట్, కార్వాన్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, గోల్కండ కోట, లంగర్ హౌస్, దుర్గా నగర్, బద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, నంబర్ 9, కిష్మత్‌పూర్, గంధం గూడ, బండ్లగూడ, శాస్త్రిపురం, అల్లబండ, మధుబన్, ధర్మసాయి (శంషాబాద్) సాహెబ్ నగర్, ఆటో నగర్, సరూర్ నగర్, వాసవి నగర్, నాగోల్, ఎన్టీఆర్ నగర్, వనస్థలీపురం, దేవేందర్ నగర్, ఉప్పల్, స్నేహపురి ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోనుంది.
అలాగే భరత్ నగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచెర్ల, మానిక్ చంద్, మల్లిఖార్జున నగర్, పీర్జాజీ గూడ, పెద్ద అంబర్ ప్రాంతాల్లోనూ వాటర్ సప్లై ఆగిపోతుంది. ఈ ప్రాంతాల్లోని వారు వాటర్ సప్లై నిలిపి వేతను దృష్టిలో ఉంచుకుని 36 గంటల అవసరాలకు సరిపడా ట్యాంకును నింపి పెట్టుకోవటం ఉత్తమం.
ఇవి కూడా చదవండి
మీ సమర్థతకు టెస్ట్.. ఈ 76ల మధ్యలో 79 ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తత.. భక్తుల ఆందోళన