Share News

Hanumakonda Flood Victims Protest: హనుమకొండలో హై టెన్షన్.. రోడ్డుపై వరద బాధితుల ఆందోళన

ABN , Publish Date - Oct 30 , 2025 | 05:10 PM

హనుమకొండలో ఉద్రిక్తత నెలకొంది.. GWMC కమిషనర్, మేయర్ వాహనాలను వరద బాధితులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Hanumakonda Flood Victims Protest: హనుమకొండలో హై టెన్షన్..  రోడ్డుపై వరద బాధితుల ఆందోళన
Hanumakonda Flood Victims Protest

హనుమకొండ : సమ్మయ్యనగర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. GWMC కమిషనర్ చాహత్ , మేయర్ సుధారాణి వాహనాలను వరద బాధితులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తులసి బార్ దగ్గర గేట్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. గోపాల్పూర్ చెరువు మత్తడి వద్ద గేట్లు మూసివేయడంతోనే గండిపడి వరద తీవ్రత పెరిగిందని సమ్మయ్య నగర్ వాసులు ఆందోళన చేపట్టారు. అధికారులు ముందస్తు చర్యలు చేపడితే ఈ పరిస్థితులు ఉండేవి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కాగా, హనుమకొండలో వరద ఉద్రిక్తత ఏర్పడింది. మొంథా తుఫాన్‌ కారణంగా పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల ఇళ్ళలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ సైతం హనుమకొండ, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే

కేంద్ర సహకారంతో రైతులను ఆదుకుంటాం: మంత్రి పొన్నం

Read Latest Telangana News

Updated Date - Oct 30 , 2025 | 05:36 PM