Vikarabad: చోరిలే మా వృత్తి.. పోలీసులకు షాక్ ఇచ్చిన కిలాడి లేడీ..
ABN , Publish Date - Jan 31 , 2025 | 02:53 PM
చోరిలే తమ వృత్తి అంటూ పోలీసుల విచారణలో తేల్చి చెప్పింది ఓ మహిళ. చైన్ స్నాచ్చింగ్ కేసులో దర్యాప్తు చెయ్యగా ఓ కిలాడి లేడీ బాగోతం బయటపడింది.

వికారాబాద్ జిల్లా: పరిగి రద్దీ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేసే కిలాడీ లేడీని పోలీసులు పట్టుకున్నారు. భువనగిరికి చెందిన అమూల్య అనే మహిళ, హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఇక్బాల్ ఇద్దరు కలిసి రద్దీ ప్రాంతాల్లో దొంగ తనాలు చేస్తున్నట్లు పోలిసులు తమ దర్యాప్తులో గుర్తించారు. కిలాడి లేడీ అమూల్యను పోలిసులు అరెస్టు చేయగా మరో నిందితుడు మహ్మద్ ఇక్బాల్ పరారీలో ఉన్నాడు. అమూల్య వద్ద నుండి దాదాపు 11 తులాల బంగారం, 80 వేల నగదు, ఒక సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేశారు.
ఈ నెల మొదటి వారంలో పరిగి బస్టాండ్‌లో జరిగిన చైన్ స్నాచ్చింగ్ కేసులో దర్యాప్తు చెయ్యగా కిలాడి లేడీ బాగోతం బయట పడింది. గతంలోనూ వీరిరువురూ కలిసి జిల్లాలో పలుచోట్ల చోరీలు చేసినట్లు తెలుస్తోంది. చోరిలే తమ వృత్తి అని పోలీసుల విచారణలో మహిళ తేల్చి చెప్పడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. మహ్మద్ ఇక్బాల్ ప్రధాన సూత్రధారిగా ఉంటూ చోరీలు ఎలా చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? అని ట్రైనింగ్ ఇచ్చేవాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. పరాలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.