Share News

తెలంగాణ, ఏపీతో విన్‌ గ్రూప్‌ చర్చలు!

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:55 AM

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫా్‌స్ట.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది.

తెలంగాణ, ఏపీతో విన్‌ గ్రూప్‌ చర్చలు!

  • ఈవీ ప్లాంట్‌ నెలకొల్పే యోచనలో వియత్నాం సంస్థ

హయ్‌ ఫాంగ్‌ (వియత్నాం), జూన్‌ 1: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫా్‌స్ట.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. విన్‌ గ్రూప్‌కు చెందిన విన్‌ఫా్‌స్ట రూ.17 వేల కోట్లతో ఈవీల తయారీ యూనిట్‌ను ఇప్పటికే తమిళనాడులోని తూతుకుడిలో ఏర్పాటు చేస్తోంది. భారత మార్కెట్‌లో ఈ ఏడాది రాబోయే పండగల సీజన్‌కల్లా విన్‌ఫా్‌స్టకు చెందిన వీఎఫ్‌6, వీఎఫ్‌7 ఈవీలను ప్రవేశపెట్టాలని సంస్థ యోచిస్తోంది. ‘‘మేం భారత్‌లో చాలా రాష్ట్రాల్లో పర్యటించాం. అనేక ప్రాంతాలను పరిశీలించాం. చివరికి తూతుకుడిలో ఈవీల ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు బాగున్నాయి. సమీపంలోనే నౌకాశ్రయం, విమానాశ్రయం ఉన్నాయి’’ అని విన్‌ఫా్‌స్ట ఆసియా సీఈవో ఫామ్‌ సాన్‌ చౌ చెప్పారు. ఈ ఏడాది పండగ సీజన్‌లోపే వీఎఫ్‌6, వీఎఫ్‌7 ఈవీలను భారత మార్కెట్లో ప్రవేశపెడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత మార్కెట్‌ చాలా కీలకమని, తాము మరింత విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. 15 నెలలుగా తమిళనాడులో ప్లాంట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.


వేలిముద్రల కోసం మూడుసార్లు బారులు

  • ముందస్తు రేషన్‌ పంపిణీలో లబ్ధిదారుల ఇబ్బందులు

  • ఆదివారం పూర్తిస్థాయిలో ప్రారంభం కాని పంపిణీ

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల రేషన్‌ను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభమయింది. అయితే జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు వేలిముద్రల కోసం మూడుసార్లు రేషన్‌ దుకాణాల ముందు బారులు తీరాల్సిరావడం లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది. అటు డీలర్లకు రేషన్‌ బియ్యం పూర్తిస్థాయిలో అందకపోవడంతో చాలా జిల్లాల్లో ఆదివారం పంపిణీ జరగలేదు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 92 లక్షల రేషన్‌ కార్డుల్లో, 55 లక్షలు కేంద్రం ఇచ్చిన ఎన్‌ఎ్‌సఎ్‌ఫఏ కార్డులు కాగా, 37 లక్షలు రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన కార్డులు ఉన్నాయి. ఎన్‌ఎ్‌సఎ్‌ఫఏ కార్డుదారులకు కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యానికి రాష్ట్రం అదనంగా 1 కిలో కలిపి ఇస్తోంది. దీంతో ప్రతి నెలా రెండుసార్లు వేలిముద్రలు వేయడం అవసరం అవుతుంది. మూడు నెలల ముందస్తు పంపిణీ కావడం వల్ల ఒక్కో కార్డుదారుడు ఆరుసార్లు వేలిముద్ర వేయించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 02 , 2025 | 03:55 AM