Share News

Vakiti Srihari: విధేయతకు పట్టం

ABN , Publish Date - Jun 09 , 2025 | 03:44 AM

కాంగ్రెస్‌ పార్టీ విధేయుడికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరి..

 Vakiti Srihari: విధేయతకు పట్టం

విద్యార్థి దశ నుంచి కాంగ్రె్‌సలోనే వాకిటి శ్రీహరి

తొలి పోటీలోనే ఎమ్మెల్యేగా గెలుపు.. మంత్రి పదవి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరింత ప్రాధాన్యం

మహబూబ్‌నగర్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో వాకిటి శ్రీహరికి చోటు దక్కడం.. కాంగ్రెస్‌ పార్టీ విధేయుడికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరి.. విద్యార్థి దశ నుంచి నేడు మంత్రి అయ్యేదాకా కాంగ్రె్‌సలోనే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. బీఏ చదివిన వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993వరకు ఎన్‌ఎ్‌సయూఐ మక్తల్‌ మండల అధ్యక్షడిగా పనిచేశారు. అనంతరం 1993 నుంచి 1996 వరకు మక్తల్‌ మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 1996 నుంచి 2001 వరకు మక్తల్‌ మండల కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2001లో మక్తల్‌ మేజర్‌ గ్రామపంచాయతీ నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు 2001 నుంచి 2006 వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం కాంగ్రె్‌సలోనే వివిధ బాధ్యతల్లో పనిచేసిన శ్రీహరి.. 2014లో మక్తల్‌ నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు. అదే సమయంలో జిల్లా పరిషత్తులో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా వ్యవహరించారు. పార్టీలో డీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2022లో నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీహరి భార్య లలిత కూడా ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. కాగా, 2024 పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం సమయంలో ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని రేవంత్‌ హామీ ఇచ్చారు. ముదిరాజ్‌ వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చి.. రేవంత్‌ తన మాటను నిలబెట్టుకున్నారు. క్యాబినెట్‌లో శ్రీహరికి చోటు కల్పించడం ద్వారా సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు మరింత ప్రాధాన్యం కల్పించినట్లయింది. ఉమ్మడి జిల్లా నుంచి సీఎం రేవంత్‌తోపాటు ఇప్పటికే జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 03:45 AM