Share News

Vakiti Srihari: 2036 ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:02 AM

క్రీడాకారులు గత వైఫల్యాలు, అలసత్వాన్ని పక్కన బెట్టి 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.

Vakiti Srihari: 2036 ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం

  • త్వరలో శిక్షకులు, నిపుణులతో భేటీ: మంత్రి వాకిటి

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు గత వైఫల్యాలు, అలసత్వాన్ని పక్కన బెట్టి 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. క్రీడలను శిఖర స్థాయికి చేర్చాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆలోచనలకనుగుణంగా క్రీడాశాఖ పనితీరులో కొత్తదనం కనిపించాలని పేర్కొన్నారు.


రాష్ట్ర స్పోర్ట్స్‌ అఽథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డితో కలిసి శనివారం ఆయన క్రీడాశాఖ పనితీరుపై సమీక్షిస్తూ.. క్రీడారంగంలో సమూల మార్పులు తేవాలంటే క్షేత్రస్థాయికి వెళ్లాలని, కార్యాలయాలకు పరిమితం కావద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి త్వరలో వివిధ క్రీడల శిక్షకులు, నిపుణులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Jul 06 , 2025 | 04:02 AM