Share News

US Consul General: తెలంగాణలో అమెరికన్‌ వ్యాపారాల విస్తరణకు కృషి చేస్తా

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:12 AM

భారత్‌, అమెరి కా మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపర్చడానికి తాను ప్రాధాన్యమిస్తానని హైదరాబాద్‌కు కొత్తగా రాబోతున్న యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్‌ చెప్పారు.

US Consul General: తెలంగాణలో అమెరికన్‌ వ్యాపారాల విస్తరణకు కృషి చేస్తా

  • హైదరాబాద్‌కు కొత్తగా రాబోతున్న యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్‌

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): భారత్‌, అమెరి కా మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపర్చడానికి తాను ప్రాధాన్యమిస్తానని హైదరాబాద్‌కు కొత్తగా రాబోతున్న యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్‌ చెప్పారు. విశ్వాసం, సాంకేతికత, మేధో సంపత్తి పరస్పర బదిలీ వంటి అంశాల ఆధారంగా దౌత్య బంధాన్ని దృఢపర్చడానికి ప్రయత్నిస్తానని ఆమె అన్నారు. తెలంగాణలో అమెరికన్‌ వ్యాపారాలు విస్తరించడానికి కృషి చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌కు రాబోయే ముందు యూఎ్‌స-ఇండియా సాలిడారిటీ మిషన్‌ వ్యవస్థాపకుడు, ఇన్‌ఫ్లుయెన్షియల్‌ ఇండియన్‌ అమెరికన్‌ బిజినెస్‌ ఇంప్యాక్ట్‌ గ్రూప్‌ (ఐఏఎంబీఐజీ) సహ వ్యవస్థాపకుడు రవి పులి ఆధ్వర్యంలో వర్జీనియాలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో లారా విలియమ్స్‌ మాట్లాడారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ స్థానంలో లారా విలియమ్స్‌ రాబోతున్నారు. దౌత్యానికి సాంకేతికత, విశ్వసనీయత ప్రధానమని, దాన్ని ఆధారంగా చేసుకొని ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తానని ఆమె చెప్పారు. యూఎస్‌ వీసాల జారీలో జాప్యంపై మాట్లాడుతూ.. హైదరాబాద్‌ కార్యాలయంలోని 54 వీసా విండోస్‌ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకు ని మరింత చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 04:12 AM