Share News

Nizampet: మద్యం మత్తులో యువతిపై సామూహిక అత్యాచారం!

ABN , Publish Date - May 13 , 2025 | 04:05 AM

తననే నమ్ముకొని ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చిన స్నేహితురాలిపట్ల ఘోరానికి పాల్పడ్డాడా యువకుడు పార్టీ చేసుకుందాం అని పిలిచి.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు.

Nizampet: మద్యం మత్తులో యువతిపై సామూహిక అత్యాచారం!

  • ఇద్దరు నిందితుల అరెస్టు.. వారిలో ఒకరు ఆమె స్నేహితుడే

నిజాంపేట్‌, మే 12 (ఆంద్రజ్యోతి): తననే నమ్ముకొని ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చిన స్నేహితురాలిపట్ల ఘోరానికి పాల్పడ్డాడా యువకుడు! పార్టీ చేసుకుందాం అని పిలిచి.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. నిజాంపేటలో ఈనెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీసుల వివరాల ప్రకారం జార్ఖండ్‌కు చెందిన యువతి (20) చెన్నైలోని ఓ కాలేజీలో బయోమెడికల్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న, ఆ రాష్ట్రానికే చెందిన అజయ్‌ (20) అనే యువకుడు ఆమెకు స్నేహితుడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ ఇప్పిస్తానని స్నేహితురాలిని అతడు నమ్మించాడు.


ఇందుకు నగరానికి వచ్చిన ఆమె, కూకట్‌పల్లిలోని ఓ హస్టల్‌లో ఉంటోంది. అజయ్‌కు నగరంలో జార్ఖండ్‌కే చెందిన హరి (22) అనే స్నేహితుడు ఉన్నాడు. హరి ప్రగతినగర్‌లోని రాజీవ్‌ గృహకల్ప ఫ్లాట్‌లో ఉంటూ సమోసాల వ్యాపారం చేస్తున్నాడు. యువతికి ఫోన్‌ చేసిన అజయ్‌.. హరి ఫ్లాట్‌కు రావాలని, అక్కడ పార్టీ చేసుకుందామని ఆమెను ఆహ్వానించాడు. అంగీకరించిన ఆమె ఈనెల 3న రాత్రి హరి ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడ అజయ్‌, హరి, యువతి కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో అర్ధరాత్రి ఆమెపై అజయ్‌, హరి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అక్కడికి వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా వారిని పట్టుకొని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు.

Updated Date - May 13 , 2025 | 04:05 AM