Share News

Tupran: సిబ్బంది డుమ్మా.. డిగ్రీ పరీక్ష ఆలస్యం

ABN , Publish Date - May 02 , 2025 | 05:55 AM

తూప్రాన్‌లోని నలంద డిగ్రీ కళాశాల సిబ్బంది ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో పరీక్షల షెడ్యూల్‌ అడ్డంకి కలిగింది. అధికారులు రంగంలోకి దిగిన తర్వాత 2.5 గంటల ఆలస్యంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి.

Tupran: సిబ్బంది డుమ్మా.. డిగ్రీ పరీక్ష ఆలస్యం

5 నెలలుగా జీతాల్లేవని అలిగిన ఉద్యోగులు

కళాశాల తాళాలు కూడా తీయని వైనం

అధికారుల చొరవతో

2.15 గంటల ఆలస్యంగా పరీక్ష నిర్వహణ

తూప్రాన్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో ఘటన

తూప్రాన్‌, మే 1(ఆంధ్రజ్యోతి): యాజమాన్యం తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే కారణంతో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లోని నలంద డిగ్రీ కళాశాల సిబ్బంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారు. కళాశాలలో డిగ్రీ మొదటి సెమిస్టర్‌ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతుండగా.. గురువారం హఠాత్తుగా విధులకు డుమ్మా కొట్టారు. కనీసం కళాశాల తాళాలు కూడా తీయలేదు. దీంతో గురువారం పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందారు. చివరికి వర్సిటీ, ప్రభుత్వ అధికారుల చొరవతో రెండున్నర గంటల ఆలస్యంగా పరీక్ష ప్రారంభమవ్వడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. తూప్రాన్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం కంప్యూటర్‌ సైన్స్‌, గణితం, భౌతిక శాస్త్రం పరీక్షలుండగా.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. నలంద కాలేజీని నలుగురు విద్యార్థులకు పరీక్ష కేంద్రం గా కేటాయించారు. వారు నిర్ణీత సమయానికి చేరుకున్నారు. కానీ, యాజమాన్యం, సిబ్బంది ఆ సమయానికి కళాశాల తాళం కూడా తీయలేదు. కాసేపు వేచి చూసిన విద్యార్థులు తమ కళాశాలకు సమాచారం ఇచ్చారు. మరోపక్క, ఓయూ నుంచి పరీక్షలకు అబ్జర్వర్‌గా ఉన్న సుదర్శన్‌ రెడ్డి పరీక్ష కేంద్రానికి చేరుకుని విషయం తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.


ఆర్డీవో ఆదేశాల మేరకు కళాశాల వద్దకు చేరుకున్న తూప్రాన్‌ తహసీల్దార్‌, పోలీసులు.. కళాశాల సిబ్బందికి ఫోన్‌ చేయగా ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో విధులకు రావ డం లేదని తేల్చిచెప్పారు. ఈలోగా కళాశాల సిబ్బంది ఒకరు వచ్చి తాళం తీయగా విద్యార్థుల తరఫున వారు సామగ్రిని ధ్వంసం చేశారు. అయితే, ప్రశ్నపత్రాలు డౌన్‌లోడ్‌ చేసేందుకు కళాశాలకు ఓయూ నిర్దేశించిన లాగిన్‌ ఐడీ లేకపోవడంతో.. జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనాథ్‌ ఆదేశాల మేరకు మరో కళాశాల నుంచి అధికారులు ప్రశ్నపత్రాలు తెప్పించి 2.15 గంటల ఆలస్యంగా ఉదయం 11.45 గంటలకు పరీక్షను ప్రారంభించారు. పరీక్ష నిర్వహణను తహసీల్దారు విజయలక్ష్మీ పర్యవేక్షించారు. పరీక్షలపట్ల నిర్లక్ష్యం వహించిన కళాశాల యాజమాన్యం, సిబ్బందిపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 05:55 AM