Tummala: స్వచ్ఛమైన వంట నూనె ఉత్పత్తే లక్ష్యం
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:47 AM
దేశానికి స్వచ్ఛమైన, కల్తీ లేని వంట నూనెను అందించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు పెడతాం
ఆయిల్ పామ్ పిప్పితో కరెంటు తయారీ: తుమ్మల
రంగారెడ్డి అర్బన్ జూలై 28 (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వచ్ఛమైన, కల్తీ లేని వంట నూనెను అందించడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లిలో 550 ఎకరాల విస్తీర్ణంలో శనివారం మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర హార్టికల్చర్, సెరికల్చర్ డైరెక్టర్ యాస్మిన్‌బాషా, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. రైతులకు యూరి యా బస్తాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. భూమి ఉన్న ప్రతి రైతు ఆయిల్‌పామ్‌పై దృష్టి సారించాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటు, అక్కడే విద్యుత్ తయారీ ఉంటుందని వెల్లడించారు. కర్మాగారానికి కావాల్సిన కరెంటును ఆయిల్‌పామ్ పిప్పితోనే తయారు చేయనున్నట్టు ఆయన చెప్పారు.