Tummala : నేతన్నలకూ రుణమాఫీ: తుమ్మల
ABN , Publish Date - May 03 , 2025 | 05:21 AM
రైతులకు రుణమాఫీ చేసినట్లుగానే, నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత వర్గాల సమస్యలపై క్యాబినెట్‌లో చర్చించి, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.
యాదాద్రి/ఖమ్మం, మే 2 (ఆంధ్రజ్యోతి): రైతులకు రుణమాఫీ చేసినట్లుగానే, నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత వర్గాల సమస్యలపై క్యాబినెట్‌లో చర్చించి, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో చేనేత సదస్సులో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.50 కోట్లతో నిర్మించనున్న అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ పనులకు, రూ.50లక్షలతో నిర్మిస్తున్న టేబుల్ టెన్నిస్ ఇండోర్ హాల్ భవన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతులు, నేతన్నల సంక్షేమాన్ని విస్మరించేది లేదని చెప్పారు.