Workers Union: 3న ఛలో బస్‌భవన్
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:34 AM
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో ఉద్యోగులపై రోజురోజుకూ పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించడానికి, కార్మికులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ), ఐఎన్‌టీయూసీ ఛలో బస్‌భవన్‌కు పిలుపునిచ్చాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో ఉద్యోగులపై రోజురోజుకూ పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించడానికి, కార్మికులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ), ఐఎన్‌టీయూసీ ఛలో బస్‌భవన్‌కు పిలుపునిచ్చాయి. మే 3న బస్‌భవన్‌ను ముట్టడిస్తున్నట్లు ఎస్‌డబ్ల్యూయూ రాష్ట్ర కమిటీ వెల్లడించింది.
పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పలు దఫలుగా వినతిపత్రాలు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాష్ట్ర కమిటీ పేర్కొంది. కార్మికులపై పెరిగిన పనిభారం, ఖాళీలు భర్తీ చేయకపోవడం, ఉద్యోగులపై అధికారుల వేధింపులు, ఇతర ప్రధాన సమస్యలనుప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామని రాష్ట్రకమిటీ తెలిపింది.