TPCC Cabinet Expansion: త్వరలో మరో ముగ్గురికి పదవులు
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:58 AM
ఈసారి మంత్రివర్గ విస్తరణలో కుల సమీకరణాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి చోటు దక్కలేదని.. వచ్చేసారి ఆయనకు చోటు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
మల్‌రెడ్డికి అప్పుడు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తాం
ఈసారి కుల సమీకరణలతోనే ఆయనకు చోటు దక్కలేదు
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
చాదర్‌ఘాట్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): త్వరలో చేపట్టే క్యాబినెట్ విస్తరణలో మరో మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈసారి మంత్రివర్గ విస్తరణలో కుల సమీకరణాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి చోటు దక్కలేదని.. వచ్చేసారి ఆయనకు చోటు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. మంత్రి పదవికి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మల్‌రెడ్డి రంగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసి మహేశ్ గౌడ్‌తోపాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం రాత్రి హుటాహుటిన మలక్‌పేట తిరుమలహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చి బుజ్జగించారు. అనంతరం ఎమ్మెల్యే మల్‌రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు మూడు స్థానాలతోనే క్యాబినెట్ విస్తరణ జరిగిందని మహేశ్ గౌడ్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని అధిష్ఠానానికి కూడా వివరించామన్నారు. రాష్ట్రంలోని 40 శాతం జనాభా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉంటుందని, భవిష్యత్తులో ఈ జిల్లాలకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహానికి గురికాకుండా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News