THCAA: హైకోర్టు జడ్జీల బదిలీని నిలిపేయండి
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:44 AM
Telangana HC judges transfer, TCHA demand, Justice K Surender, Justice P. Shreesudha, Supreme Court Collegium, Telangana High Court, judges transfer issue, transparency in transfers, lawyer association protest, Telangana lawyer demand
న్యాయవాదుల సంఘం ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణకు చెందిన ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను నిలిపేయాలని హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (టీహెచ్‌సీఏఏ) మంగళవారం డిమాండ్ చేసింది. సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కొంతమంది జడ్జీలను లక్ష్యంగా చేసుకొని బదిలీలు చేయడం అన్యాయమని అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ కే సురేందర్, జస్టిస్ పి. శ్రీసుధను ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొంతమంది న్యాయమూర్తులను ఎంపిక చేసుకుని బదిలీ చేస్తున్న విధానంపై నిరసన తెలిపేందుకు అత్యవసరంగా టీహెచ్‌సీఏఏ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ.. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో పారదర్శకత లేదని తెలిపారు.