TGIIC: ఫార్మాసిటీ భూముల చుట్టూ ఇనుప కంచె
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:34 AM
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములకు హద్దులను గుర్తించి ఇనుపకంచెను నాటే పనుల్లో టీజీఐఐసీ అధికారులు నిమగ్నమయ్యారు.

యాచారం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములకు హద్దులను గుర్తించి ఇనుపకంచెను నాటే పనుల్లో టీజీఐఐసీ అధికారులు నిమగ్నమయ్యారు. మంగళవారం నానక్‌నగర్, తాటిపర్తి గ్రామాల మధ్య జరుగుతున్న పనులను రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు పర్యవేక్షించారు. కోర్టు స్టే ఉన్న భూముల జోలికి వెళ్లరాదని సిబ్బందికి సూచించారు. సర్వేలో భారీ బండరాళ్లు అడ్డు వస్తే వాటికి డ్రిల్లింగ్ చేసి ఇనుపరాడ్లు వేసి తక్షణమే కాంక్రీట్ వేసి బిగించాలన్నారు.
యాచారం కందుకూరు మండలాల మధ్య 120 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయని వారు చెప్పారు. సేకరించిన భూముల్లో పంటలుంటే పంట కోసే వరకు రైతులకు ఇబ్బంది కలిగించబోమన్నారు. ఈ పనులకు సుమారు రూ.16 కోట్ల మేర వ్యయం కావచ్చని జోనల్ మేనేజర్ శ్రావణ్‌కుమార్ ఆంధ్రజ్యోతితో చెప్పారు.