TGERC: పురపాలక వ్యర్థాల కరెంట్ ధర యూనిట్‌కు రూ.6.87
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:10 AM
పురపాలక వ్యర్థాలతో తయారు చేసే విద్యుత్‌కు యూనిట్ ధరను రూ.6.87గా టీజీఈఆర్‌సీ ఖరారు చేసింది. దుండిగల్‌లోని 14.5 మెగావాట్ల ప్లాంట్ యాజమాన్యం కోరిన ధరకు బదులుగా తక్కువగా నిర్ణయించింది.
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): పురపాలక వ్యర్థాలతో ఉత్పత్తి చేసే కరెంట్ ధరను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) ఖరారు చేసింది. యూనిట్ ధరను రూ.6.87లుగా నిర్ధారించింది. ఈ ఉత్తర్వులు గతేడాది మార్చి 3వ తేదీ నుంచి అమల్లోకి వ స్తాయని పేర్కొంటూ ఈఆర్‌సీ ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్‌లో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో పురపాలక వ్యర్థాలతో(రెఫ్యూస్ డిరైవ్డ్ ఫ్యూయల్) ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఉంది. ఒక యూనిట్‌కు రూ.15.87లుగా ఛార్జీ ఖరారు చేయాలని ఈ ప్లాంట్ యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కమిషన్... ధరను యూనిట్‌కు రూ.6.87లుగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news