Hyderabad: దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:09 AM
రాష్ట్రంలోని దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు.
వారి ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు: వీరయ్య
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. మహిళా ఎస్‌హెచ్‌జీల తరహాలో ఈ ఎస్‌హెచ్‌జీలు ఉంటాయని తెలిపారు. ఆయన బుధవారం ఈ అంశంపై తన కార్యాలయంలో సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్‌తో భేటీ అయి చర్చించారు. అనంతరం మాట్లాడారు. దివ్యాంగులను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు విధి విధానాలపై చర్చించామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒక దివ్యాంగుల ఎస్‌హెచ్‌జీ ఏర్పాటు చేస్తామని, వాటిలో ఐదుగురి నుంచి 20 మంది వరకు సభ్యులు ఉంటారని తెలిపారు. ప్రతి గ్రామంలో స్థానిక మహిళా ఎస్‌హెచ్‌జీల ప్రతినిధులు, గ్రామ సంఘం ప్రతినిధులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు.. దివ్యాంగులను గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేస్తారని వివరించారు. ఈ సంఘాల్లో మహిళలే కాకుండా పురుషులు కూడా సభ్యులయ్యే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు.