National Handloom Day: 33 మందికి కొండా లక్ష్మణ్ అవార్డులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:50 AM
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న 33 మంది చేనేత వృత్తి కార్మికులు, డిజైనర్లను రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులతో గురువారం సత్కరించనుంది.
నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న 33 మంది చేనేత వృత్తి కార్మికులు, డిజైనర్లను రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులతో గురువారం సత్కరించనుంది. హైదరాబాద్ నెక్లె్‌సరోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో సుమారు వంద స్టాళ్లతో చేనేత ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్టు శైలజా రామయ్యర్ తెలిపారు.
ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన చేనేత కార్మికులు, వృత్తి నిపుణులు, డిజైన ర్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పురస్కారాలను ప్రదానం చేస్తారన్నారు. కాగా, చేనేత రంగానికి, నేతన్నల కుటుంబాలకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నేతన్నలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.