Share News

కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.29,899 కోట్లు..

ABN , Publish Date - Feb 02 , 2025 | 03:54 AM

కేంద్ర పన్ను ల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు ఈసారి 21.83ు మేర నిధులు పెరిగాయి. తాజా బడ్జెట్‌లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ.29,899.77 కోట్లను కేంద్రం సూచించింది.

కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.29,899 కోట్లు..

  • 2024-25 కంటే 21.83% అధికం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పన్ను ల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు ఈసారి 21.83ు మేర నిధులు పెరిగాయి. తాజా బడ్జెట్‌లో పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ.29,899.77 కోట్లను కేంద్రం సూచించింది. ఇందులో కార్పొరేషన్‌ ట్యాక్స్‌ కింద రూ.8,349,04 కోట్లు, ఆదాయ పన్ను కింద రూ.11,140.06 కోట్లు, సెంట్రల్‌ జీఎస్టీ కింద రూ.8,704.59 కోట్లు, కస్టమ్స్‌ డ్యూటీ కింద రూ.1,376.22 కోట్లు, యూనియన్‌ ఎక్సైజ్‌ డ్యూటీ కింద రూ.285.91 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ కింద రూ.0.86 కోట్లు, ఇతర ట్యాక్సులు, సుంకాల కింద రూ.43.09 కోట్లను కేటాయించింది. 2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా కింద రూ.26,216.38 కోట్లు వస్తాయని సర్కారు అంచనా వేసింది. కానీ.. కేంద్రం రూ.24,540.43 కోట్లుగా నిర్ధారించింది.


ఈ లెక్కన 2024-25 ఆర్థిక సంవత్సరం కంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అదనంగా రూ.5,359.34 కోట్ల(21.83ు)ను కేంద్రం కేటాయించినట్లయింది. వాస్తవానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద కొత్త బడ్జెట్‌లో రూ.14,22,444 కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో 41ు వాటాను రాష్ట్రాలకు పంచుతోంది. ఇందులో తెలంగాణకు 2.102ు నిధులు రావాల్సి ఉంటుంది. ఆమేరకు రూ.14,22,444 కోట్లలో తెలంగాణకు రూ.29,899.77 కోట్లను కేటాయించారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల్లో తన 4.047ు వాటా మేరకు రూ.57,566.31 కోట్లను కేటాయించారు.

Updated Date - Feb 02 , 2025 | 03:54 AM