ICET Counseling: 20 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:58 AM
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్ కౌన్సెలింగ్ ప్రణాళికను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటిచింది.
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్ కౌన్సెలింగ్ ప్రణాళికను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటిచింది. ఈనెల 20 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సెప్టెంబరు 2న జాబితా ప్రకటిస్తారు. అలాగే రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 8న ప్రారంభం కానుంది. అదేనెల 15న స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు.
20 నుంచి గ్రూప్-2 ధ్రువపత్రాల పరిశీలన
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసింది. ఈనెల 20 నుంచి 23 వరకు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆలా తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్లో పెట్టామన్నారు. అలాగే, అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఈనెల 18 నుంచి 25 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇవ్వాలని ఆమె బుధవారం ఒక ప్రకటనలో కోరారు.