TGNPDCL: ఎన్పీడీసీఎల్‌లో కొత్తగా 339 పోస్టులు
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:48 AM
అవసరం లేని పోస్టులను రద్దుచేసి, వాటి స్థానంలో కొత్తగా ఉత్తర డిస్కమ్(టీజీఎన్పీడీసీఎల్-వరంగల్)లో 339 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, జూలై 2(ఆంధ్రజ్యోతి): అవసరం లేని పోస్టులను రద్దుచేసి, వాటి స్థానంలో కొత్తగా ఉత్తర డిస్కమ్(టీజీఎన్పీడీసీఎల్-వరంగల్)లో 339 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెలిఫోన్ బాయ్, బీపీవో, కార్పెంటర్, సివిల్ మేస్త్రీ, స్టోర్ కీపర్, టూల్ కీపర్, టెలిఫోన్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టుల అవసరం లేదని, వీటికి బదులుగా 339 కొత్త పోస్టులు మంజూరు చేయాలని డిస్కమ్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ప్రతిపాదనలు పంపించగా... ప్రభుత్వం అంగీకరించింది.