Share News

Jayalakshmi: ఆరేళ్ల పోరాటం తర్వాత పోస్టింగ్‌

ABN , Publish Date - May 13 , 2025 | 04:09 AM

చేయని తప్పుకు శాఖాధిపతి ఆగ్రహానికి గురైన అటవీశాఖ అధికారి జయలక్ష్మికి ఆరేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు పోస్టింగ్‌ లభించింది. సచివాలయం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా జయలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Jayalakshmi: ఆరేళ్ల పోరాటం తర్వాత పోస్టింగ్‌

  • సచివాలయ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా జయలక్ష్మి

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): చేయని తప్పుకు శాఖాధిపతి ఆగ్రహానికి గురైన అటవీశాఖ అధికారి జయలక్ష్మికి ఆరేళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు పోస్టింగ్‌ లభించింది. సచివాలయం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా జయలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అటవీశాఖలో విధులు నిర్వరిస్తున్న జయలక్ష్మి.. 2013లో పదోన్నతిపై భద్రాచలం నుంచి నిజామాబాద్‌ సర్కిల్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌గా వెళ్లారు. తర్వాత ఇన్‌చార్జి మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు.


అప్పుడే ఆర్‌టీఐ కింద దరఖాస్తుదారుడికి సమాచారమిచ్చారు. అలా ఆర్‌టీఐ కింద సమాచారం ఇవ్వడమే తప్పని ఆమెపై శాఖాధిపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలక్ష్మిని బాధ్యతలను తప్పించడంతోపాటు వేధింపులకు గురి చేయడంతో బాధితురాలు న్యాయం కోసం మహిళా కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)లను ఆశ్రయించారు. నాటి రాష్ట్ర అటవీశాఖాధిపతిగా ఉన్న పీసీసీఎఫ్‌ రిటైర్‌మెంటైన కొద్ది రోజుల్లోనే జయలక్ష్మికి తిరిగి పోస్టింగ్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - May 13 , 2025 | 04:09 AM