Sammakka Sarakka: టూరిజంపై ఫోకస్.. సీఎం రేవంత్ రివ్యూలో హైలెట్స్
ABN , Publish Date - Jan 29 , 2025 | 08:44 PM
Sammakka Sarakka: తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులోభాగంగా ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, జనవరి 29: సమ్మక్క - సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డిపార్ట్‌మెంట్లు సంయుక్తంగా ప్రణాళికలు సిద్దం చేయాలన్న ఆ యా శాఖల ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ జాతరతో పాటు ఆ సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారికి సీఎం సూచించారు.
ఆ క్రమంలో ఫిబ్రవరి 10వ తేదీ లోపు పూర్తి టూరిజం పాలసీని సిద్దం చేయాలని ఉన్నతాధికారులకు ఆయన గడువు విధించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో టూరిజం పాలసీ విధి విధానాలు ఖరారు చేసేందుకు పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిచారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ పలు కీలక సూచనలు చేశారు. అందులోభాగంగా దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పాలసీని రూపొందించాలని చెప్పారు.
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
అలాగే దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలంటూ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా వారికి వివరించారు.
Also Read: పరేడ్‌లో శకటానికి బహుమతి.. స్పందించిన సీఎం చంద్రబాబు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలంటూ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు.
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య, ఎన్టీఆర్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యాటకాభివృద్ధి ద్వారా రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా విధి విధానాలను రూపొందించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
For Telangana News And Telugu News