G Anil Kumar: సమీకృత వరద యాజమాన్య విధానం అమలు చేయాలి: ఈఎన్‌సీ(జనరల్)
ABN , Publish Date - May 20 , 2025 | 04:16 AM
వరదలపై సమాచారం లేనందువల్లే విపత్తులు సంభవిస్తున్నాయని, దీనికోసం సమీకృత వరద యాజమాన్య విధానం అమలు చేయాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ జనరల్ జి.అనిల్‌కుమార్ కోరారు.
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): వరదలపై సమాచారం లేనందువల్లే విపత్తులు సంభవిస్తున్నాయని, దీనికోసం సమీకృత వరద యాజమాన్య విధానం అమలు చేయాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) జి.అనిల్‌కుమార్ కోరారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల అధికారులతో ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఐఎ్‌ఫఎంఎ్‌స)పై వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. తుపానుల సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షితంగా తరలించడానికి మేలు చేస్తుందని అనిల్ కుమార్ చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రాలతో సమన్వయం కోసం వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.