Archaka Welfare Trust: పదవీ విరమణ చేసిన అర్చక, సిబ్బందికి గ్రాట్యూటీ
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:20 AM
వాదాయశాఖ చరిత్రలో రిటైరైన అర్చక, సిబ్బందికి తొలిసారి ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా గ్రాట్యూటీ అందిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు తెలిపారు.
అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం
హైదరాబాద్, జూలై 24(ఆంధ్రజ్యోతి): దేవాదాయశాఖ చరిత్రలో రిటైరైన అర్చక, సిబ్బందికి తొలిసారి ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా గ్రాట్యూటీ అందిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు తెలిపారు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా పలువురు అర్చక, ఉద్యోగులకు ఆర్థిక సాయమందించారు. పదవీ విరమణ చేసిన అర్చకుడు వలివేటి వీరభద్ర శర్మకు వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి రూ. 8 లక్షల గ్రాట్యూటీ పత్రాలు అందించారు.
రిటైరైన స్వీపర్ పాపమ్మకు రూ.8 లక్షలు, ఆరోగ్య బీమా కింద అర్చకుడు బాలకృష్ణకు రూ.3 లక్షలు, ఇతర అర్చక, ఉద్యోగులకు వైద్యం, పిల్లల వివాహాలకు వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సాయమందించారు. దేవాదాయ శాఖతోపాటు ధూపదీప నైవేద్య అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ఆయా సంస్థలతో చర్చిస్తున్నామని వెంకట్రావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News