Share News

Local Body Elections: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..!

ABN , Publish Date - Dec 09 , 2025 | 07:29 AM

పోలింగ్ సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ప్రచారంలో మరింత ముమ్మరంగా తిరుగుతున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఈ సారి గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరుగనున్నాయి.

Local Body Elections: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..!
Local Body Elections

ఇంటర్నెట్ డెస్క్: పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో మెల్లగా కలవరం మొదలైంది. ప్రచారానికి సుమారు వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ తలుపులు తడుతున్నారు. ఓటర్లను కలుస్తూ తమకు మద్దతుగా నిలవాలని వేడుకుంటున్నారు. ఎంత మంది పోటీలో ఉన్నా.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.


ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనుంది. దీంతో 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో మంగళవారం సాయంత్రానికి ప్రచార కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. రెండో విడత ఎన్నికలకు సంబంధించి ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 09 , 2025 | 07:29 AM