Share News

Heavy Rainfall: 4 రోజుల పాటు భారీ వర్షాలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:54 AM

తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy Rainfall: 4 రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన పడుతుందని పేర్కొంది. గురువారం నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్‌, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే ఈనెల 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - Aug 07 , 2025 | 09:29 AM