Jishnu Dev Varma: నవంబరులో తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక ఉత్సవం
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:24 AM
ఈ ఏడాది నవంబర్‌లో తెలంగాణ-ఈశాన్య రాష్ర్టాల సాంస్కృతిక ఉత్సవం జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాజ్‌భవన్‌లో జరిగిన ఉన్నత స్ధాయి సమావేశంలో సమీక్షించారు.
హైదరాబాద్, జూలై11(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నవంబర్‌లో తెలంగాణ-ఈశాన్య రాష్ర్టాల సాంస్కృతిక ఉత్సవం జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాజ్‌భవన్‌లో జరిగిన ఉన్నత స్ధాయి సమావేశంలో సమీక్షించారు. నవంబర్ 25వ తేది నుంచి 4 విడతలుగా ఈ ఉత్సవం నిర్వహిస్తామని అధికారులు గవర్నర్‌కు వివరించారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణ వాసులకు పరిచయం చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఫార్మా రంగాల పురోగతి ప్రదర్శన ఉంటుందని గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వివరించారు.
ఏక్ భారత్-శ్రేష్ట భారత్ అర్థం ప్రతిబింబించేలా ఉత్సవాన్ని నిర్వహించాలని గవర్నర్ సూచించారు. చిత్రకళ, ఫోటోగ్రఫీ, కళా ప్రదర్శనలు, మీడియా, జర్నలిజం, మహిళా సాధికారత, ఆటలు, ఫార్మా లైఫ్ సైన్స్‌్‌స రంగాలకు సంబంధించి 6వందల మంది ప్రతినిధులు ఈ ఉత్సవంలో పాల్గొంటారని అధికారులు వివరించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.