Telangana: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Jun 01 , 2025 | 07:20 PM
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ముఖ్య అతిథిగా రానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రేపు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఇంచార్జీలను నియమించింది.
పరేడ్ గ్రౌండ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇదే
09:40 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్‌కు సిద్ధం
09:45 గంటలకు పరేడ్ కమాండర్ పరేడ్ బాధ్యతలు స్వీకరిస్తారు
09:50 గంటలకు డీజీపీ డాక్టర్ జితేందర్ చేరుకుంటారు
09:52 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు చేరుకుంటారు.
09:55 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సీఎంకు స్వాగతం పలుకుతారు.
10:00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు . జాతీయ గీతం ఆలాపన - పోలీసు బ్యాండ్
10:01 గంటలకు తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన
CM ఎదుట పోలీస్ల కవాతు వందన సమర్పణ
10:04 గంటలకు ముఖ్యమంత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వందన సమర్పణ వేదిక వద్దకు తోడ్కొని వెళతారు.
10:05 గంటలకు పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రికి నివేదన
10:17 గంటలకు ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ జీపులో కవాతును పరిశీలిస్తారు. DGP, పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రితో పాటు వెళతారు
10:17 నుంచి 10:40 గంటల వరకు కంటింజెంట్ల ద్వారా మార్చ్ పాస్ట్
10:40 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు
11:00 గంటలకు తొమ్మిది మంది ప్రముఖ వ్యక్తులు/కుటుంబ సభ్యులకు నగదు పురస్కారం ప్రదానం.
11:15 గంటలకు పోలీసు సిబ్బందికి అవార్డుల ప్రదానం:
19మందికి శౌర్య పతకం-
ఇద్దరికి విశిష్ట సేవా పతకం (PSM)-2
11మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకం (MSM)-11
ఉత్తమ దళాలకు బహుమతులు ప్రదానం.
11:20 గంటలకు CM రేవంత్ రెడ్డితో అవార్డు గ్రహీతల ఫోటో
11:30 గంటలకు ముఖ్యమంత్రి వేదిక నుంచి బయలుదేరివెళతారు..
పోలీస్ సేవా పతకాలు ప్రకటించిన ప్రభుత్వం..
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులకు వివిధ విభాగాల్లోని అందించిన సేవలకుగాను ఈ పతకాలు లభించాయి. పోలీసుశాఖలో పని చేసే గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన తొమ్మిది మందికి శౌర్య పతకం అందగా, 16 మందికి మహోన్నత సేవా పతకం, 92 మందికి ఉత్తమ సేవా పతకం, 47 మందికి కఠిన సేవా పతకం, 461 మందికి సాధారణ సేవా పతకాలు లభించాయి.
అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా పతకం, మరో 17 మందికి సేవా పతకాలు దక్కాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన ఒకరికి ఉత్తమ సేవా పతకం, మరో ఐదుగురికి సాధారణ సేవా పతకాలు అందాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసులో ఇద్దరికి శౌర్య పతకం, ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 14 మందికి సాధారణ సేవా పతకాలు దక్కాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 15 మందికి సాధారణ సేవా పతకాలు లభించాయి.