Krishna Water Dispute: ఇతర బేసిన్లకు కృష్ణా జలాల తరలింపును అడ్డుకోండి
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:05 AM
ఇతర బేసిన్లకు కృష్ణా జలాలను మళ్లించకుండా కట్టడి చేయాలని, ఏపీలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి, వెలిగొండ ఔట్‌లెట్లను కట్టడి చేసేలా నిర్దిష్ట ఆంక్షలు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్(కృష్ణా ట్రైబ్యునల్-2)ను తెలంగాణ కోరింది.
పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రీనీవా, వెలిగొండను కట్టడి చేసేలా ఉత్తర్వులివ్వండి
కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ వాదనలు
వచ్చే నెల 23 నుంచి 25దాకా తదుపరి విచారణ
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఇతర బేసిన్లకు కృష్ణా జలాలను మళ్లించకుండా కట్టడి చేయాలని, ఏపీలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి, వెలిగొండ ఔట్‌లెట్లను కట్టడి చేసేలా నిర్దిష్ట ఆంక్షలు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్(కృష్ణా ట్రైబ్యునల్-2)ను తెలంగాణ కోరింది. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరుపుతున్న జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ ఎదుట శుక్రవారం తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా సాగుతున్న నీటి తరలింపును అడ్డుకునేలా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు తగిన అధికారాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలవరం వాటాలో దక్కిన 45 టీఎంసీల్లో 30టీఎంసీలను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎ్‌సఎల్‌బీసీ)కి కేటాయిస్తూ 1982లో జీవో 306 జారీ అయిందని, 1986లో కేంద్ర జలవనరుల సంఘాని(సీడబ్ల్యూసీ)కి డీపీఆర్‌ను సైతం సమర్పించారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణకు ముందు 2013లోనూ 30 టీఎంసీలు ఎస్‌ఎల్‌బీసీకి, 15టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని రాష్ట్ర స్థాయి సలహామండలి సిఫారసు చేసిందని నివేదించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ద్వారా తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులు ఉండగా..ఆధునికీకరణ చేపట్టకపోవడంతో ఏటా 5.4టీఎంసీలను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. బచావత్, బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునళ్లు మిగులు జలాలను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఏపీకి మాత్రమే ఇవ్వగా, దాని పేరిట 16.30 లక్షల ఎకరాలకు ఏపీ సాగునీటిని అందిస్తోందన్నారు. శ్రీశైలం, పులిచింతల జలాశయాల్లో ఆవిరి నష్టాల కింద 11 టీఎంసీలు, 5 టీఎంసీలు పొదుపు చేస్తున్నామని, ఆ నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు. కాగా, ట్రైబ్యునల్ తదుపరి విచారణ సెప్టెంబరు 23 నుంచి 25 దాకా జరగనుంది.
రక్తహీనత నివారణలో ఏపీ టాప్
హరియాణా, తెలంగాణకు ద్వితీయ, తృతీయ స్థానాలు
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ప్రథమ స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రక్తహీనత నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు తీసుకున్న చర్యలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ఐఎ్‌ఫఏ మాత్రలు, సిరప్ పంపిణీ ప్రాతిపదికన రాష్ట్రాల వారీగా ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ఏపీ, హరియాణా, తెలంగాణ రాష్ట్రాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు లభించాయి. ఆరు కేటగిరీలకు గాను ఐదు కేటగిరిల్లో ఏపీ తొలిస్థానాన్ని దక్కించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..