Share News

Tunga Bhadra Canal: టీబీఆర్‌బీఎల్‌ఎల్‌సీకి 17.41 టీఎంసీలు చాలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:26 AM

తుంగభద్ర రైట్‌ మెయిన్‌ లోలెవల్‌ కెనాల్‌ (టీబీఆర్‌బీఎల్‌ఎల్‌సీ) ఆయకట్టుకు శాస్త్రీయంగా 17.41 టీఎంసీలు చాలని తెలంగాణ వాదించింది.

Tunga Bhadra Canal: టీబీఆర్‌బీఎల్‌ఎల్‌సీకి 17.41 టీఎంసీలు చాలు

  • కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఎదుట తెలంగాణ వాదన

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర రైట్‌ మెయిన్‌ లోలెవల్‌ కెనాల్‌ (టీబీఆర్‌బీఎల్‌ఎల్‌సీ) ఆయకట్టుకు శాస్త్రీయంగా 17.41 టీఎంసీలు చాలని తెలంగాణ వాదించింది. టీబీఆర్‌బీఎల్‌ఎల్‌సీకి బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 29.5 టీఎంసీల్లో 5.5 టీఎంసీలు ఆవిరవుతాయని గుర్తు చేసింది. కనుక మిగతా 6.59 టీఎంసీల నీటిని తెలంగాణలోని కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయించాలని పేర్కొంది.


ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీపై జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఎదుట రెండో రోజు గురువారం వాదిస్తూ తుంగభద్ర ఎస్‌ఎల్‌సీ ఆయకట్టుకు గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడి కాల్వతోపాటు ద్వారా తుంగభద్ర నది నుంచి ఏపీ నీళ్లు తరలించుకునేందుకు అనుమతించరాదని కోరారు. గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా తుంగభద్ర జలాలను ఏపీ వాడుకోవడంతో దిగువన శ్రీశైలానికి వరద తగ్గిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక విచారణలో మూడోరోజైనా శుక్రవారం కూడా ట్రైబ్యునల్‌ ఎదుట తెలంగాణ వాదనలు కొనసాగనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:26 AM